
ఐపీఎల్ 18లో భాగంగా బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం (ఏప్రిల్ 18) పంజాబ్‌తో జరిగిన మ్యాచులో అతిథ్య ఆర్సీబీ ఓటమి పాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిరాశపర్చింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో ఆర్సీబీ బ్యాటర్లు పరుగులు చేయడానికి అవస్థలు పడ్డారు.
పిచ్ కండిషన్‌ను సరిగ్గా సద్వినియోగం చేసుకుని పంజాబ్ బౌలర్లు విజృంభించడంతో బెంగుళూరు బ్యాటర్ల పెలివిలియన్కు క్యూ కట్టారు. ఆర్సీబీ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (50), కెప్టెన్ పటిదార్ (23) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా.. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. దీంతో నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 95 పరుగులు చేసింది. అనంతరం చేధనకు దిగిన పంజాబ్.. 12.1 ఓవర్లలోనే 98/5 స్కోరు చేసి విజయం సాధించింది.
నేహల్ వాధెర (19 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 నాటౌట్) రాణించి పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. దీంతో సొంత గడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. ఈ ఓటమితో ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డ్ నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే గ్రౌండ్లో అత్యధిక మ్యాచులు (46) ఓడిన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డ్ నెలకొల్పింది. ఐపీఎల్‌లో మరే జట్టు కూడా ఒకే వేదికలో ఇన్ని మ్యాచులు ఓడిపోలేదు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఆర్సీబీ, ఢిల్లీ (45 ఓటములు) పేరిట సంయుక్తంగా ఉండగా.. తాజాగా పంజాబ్‌పై ఓటమితో ఈ చెత్త రికార్డును ఆర్సీబీ తన పేరిట లిఖించుకుంది.
ఐపీఎల్‌లో ఒకే వేదికపై అత్యధికంగా ఓడిన జట్లు:
ఆర్సీబీ-బెంగుళూరు చినస్వామి స్టేడియంలో 46 - ఓటములు
ఢిల్లీ-క్యాపిటల్స్ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం 45 ఓటములు
KKR-కోల్ కతా ఈడెన్ గార్డెన్స్‌లో 38 ఓటములు
ముంబై ఇండియన్స్-ముంబై వాంఖడే స్టేడియంలో 34 ఓటములు
పంజాబ్ కింగ్స్-మొహాలి స్టేడియంలో 30 ఓటములు