KKR vs RCB: రహానే కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు ముందు ఛాలెంజింగ్ టార్గెట్

KKR vs RCB: రహానే కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో  కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్ లో రాణించింది. కెప్టెన్ అజింక్య రహానే, సునీల్ నరైన్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రహానే హాఫ్ సెంచరీతో (31 బంతుల్లో 56: 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య 3 వికెట్లు పడగొట్టాడు. హేజల్ వుడ్ కు రెండు వికెట్లు దక్కాయి. యష్ దయాల్, సాయుష్ శర్మ, రసిఖ్ దార్ సలాంలకు తలో వికెట్ దక్కింది.  

ALSO READ | రఫ్ఫాడించిన రహానే.. IPL సీజన్18లో తొలి హాఫ్​సెంచరీ నమోదు

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన కేకేఆర్ కు మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు తొలి ఓవర్ లోనే డికాక్ (4) వికెట్ కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రహానే, సునీల్ నరైన్(45) ఆర్సీబీ బౌలర్లను చితక్కొట్టారు. ఇద్దరూ బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరి ధాటికి తొలి 6 ఓవర్లలో 60 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరి దూకుడు ఆగలేదు. చూస్తుండగానే వీరి భాగస్వామ్యం 100 పరుగులకు చేరుకుంది. ఈ క్రమంలో రహానే 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

రెండో వికెట్ కు 103 పరుగులు జోడించిన తర్వాత రహానే, నరైన్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఇక్కడ నుంచి కేకేఆర్ పతనం మొదలైంది. వెంకటేష్ అయ్యర్ (7), రింకూ సింగ్ (12), రస్సెల్ (4) సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. యంగ్ ప్లేయర్ రఘువంశీ 30 పరుగులు చేయడంతో  కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా 170 పరుగుల మార్క్ అయినా అందుకుంది. తొలి 10 ఓవర్లలో 107 పరుగులు చేసిన కేకేఆర్ చివరి 10 ఓవర్లలో కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది.                        

107-2 after 10 overs, RCB pulled things back quite nicely - especially the final four, conceding just 23 runs!

KKR finish at 174-8. Anyone's game?

LIVE: https://t.co/RZC1P0qWLc | #KKRvRCB pic.twitter.com/ilyq9aLYQf

— ESPNcricinfo (@ESPNcricinfo) March 22, 2025