
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ రేస్ లో ఒకడుగు ముందుకేసింది. గురువారం (ఏప్రిల్ 24) రాజస్థాన్ రాయల్స్ పై 11 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి టోర్నీలో ఆరో విజయాన్ని అందుకుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ లో కోహ్లీ (42 బంతుల్లో 70:8 ఫోర్లు, 2 సిక్సర్లు), పడికల్ (27 బంతుల్లో 50: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులకు తోడు బౌలింగ్ లో సమిష్టిగా రాణించడంతో టోర్నీలో ఆరో విజయాన్ని అందుకుంది. మరో వైపు రాజస్థాన్ ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులకు పరిమితమైంది.
206 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ కొట్టిన జైశ్వాల్(19 బంతుల్లో 49:7 ఫోర్లు, 3 సిక్సర్లు) పవర్ ప్లే లోనూ అదే జోరును కొనసాగించాడు. మరో ఎండ్ లో సూర్యవంశీ కూడా బ్యాట్ ఝుళిపించడంతో తొలి నాలుగు ఓవర్లలోనే 46 పరుగులు చేసింది. ఐదో ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి వైభవ్ (16) ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ మాత్రం పవర్ ప్లే లో దుమ్ము లేపాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. ఇతని ధాటికి రాజస్థాన్ పవర్ ప్లే లో 72 పరుగులు చేసింది.
Also Read : నిలకడకు మారుపేరుగా సూర్య
ఐదో ఓవర్ ఐదో బంతికి జైశ్వాల్ ఔట్ కావడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఈ దశలో పరాగ్, నితీష్ రాణా క్రీజ్ లోకి రాగానే ఎటాకింగ్ చేశారు. వేగంగా ఆడుతూ ఆర్సీబీ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. దీంతో మొదటి 8 ఓవర్లలో రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో బెంగళూరు బౌలర్లు ఒక్కసారిగా చెలరేగారు. స్వల్ప వ్యవధిలో పరాగ్(22), నితీష్ రాణా (28)ను ఔట్ చేశారు. కాసేపటికే 11 పరుగులు చేసి హెట్ మేయర్ పెవిలియన్ కు చేరాడు. చివర్లో జురెల్ (34 బంతుల్లో 47:3 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినప్పటికీ రాజస్థాన్ కు పరాజయం తప్పలేదు. ఆర్సీబీ బౌలర్లలో హేజల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్య రెండు, భువనేశ్వర్, యష్ దయాల్ ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లీ (42 బంతుల్లో 70:8 ఫోర్లు, 2 సిక్సర్లు), పడికల్ (27 బంతుల్లో 50: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో దుమ్ము లేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 70 పరుగులు చేసి కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆర్చర్, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.
RCB FINALLY break the Chinnaswamy 2025 curse 🔴#RCBvRR SCORECARD 👉 https://t.co/YqJ26zQkd4 pic.twitter.com/9B7PVh5Ep8
— ESPNcricinfo (@ESPNcricinfo) April 24, 2025