ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. సొంతగడ్డపై బెంగళూరుపై 35 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ 171 పరుగులకే పరిమితమైంది. టోర్నీలో సన్ రైజర్స్ కు 9 మ్యాచ్ ల్లో ఇది మూడో ఓటమి కాగా.. బెంగళూరుకు ఇది 9 మ్యాచ్ ల్లో రెండో గెలుపు.
206 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ ప్రారంభం నుంచి తడబడింది. తొలి ఓవర్లోనే హెడ్(1) ఔటయ్యాడు. అభిషేక్ శర్మ (31) కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. ఆదుకుంటారనుకున్న మార్కరం(7), క్లాసన్(7) సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ 62 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన అబ్దుల్ సమద్(10), నితీష్ రెడ్డి (13) వెంటనే పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ పరాజయం ఖరారైంది. ఈ దశలో కమ్మిన్స్(31) కాసేపు మెరుపులు మెరిపించినా అవి జట్టు విజయానికి సరిపోలేదు.
also read : IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
చివరి వరకు క్రీజ్ లో ఉన్న షాబాజ్ అహ్మద్ (40) బ్యాట్ ఝళిపించడంలో విఫలమయ్యాడు. దీంతో సన్ రైజర్స్ లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో స్వపిణి సింగ్, కరణ్ శర్మ, గ్రీన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. పటిదార్ 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు.. విరాట్ కోహ్లీ 51 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది
Royal Challengers Bengaluru stun high-flying Sunrisers Hyderabad to keep IPL 2024 playoff hopes alive#SRHvsRCB #ipl2024 #royalchallengersbengaluru #viratkohlihttps://t.co/rrVJM1ZzpU
— IndiaTVSports (@IndiaTVSports) April 25, 2024