
ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ రాయల్స్ పై అలవోక గెలుపుతో టోర్నీలో నాలుగో విక్టరీని తమ ఖాతాలో వేసుకుంది. మొదట బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో పాటు.. ఛేజింగ్ లో సాల్ట్(33 బంతుల్లో 65:5 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 65: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచి కొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల డీసెంట్ టోటల్ చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17.3 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసి గెలిచింది.
174 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు సాల్ట్ ఎప్పటిలాగే మెరుపు ఆరంభాన్ని అందించాడు. తొలి ఓవర్ లోనే 10 పరుగులు చేసి దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. మరో ఎండ్ లో కోహ్లీ ఆచితూచి ఆడినా సాల్ట్ మాత్రం చెలరేగిపోయాడు. దీంతో ఆర్సీబీ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. పవర్ ప్లే తర్వాత 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సాల్ట్(65) ఔటయ్యాడు.
►ALSO READ | RR vs RCB: కోహ్లీ సింపుల్ క్యాచ్ మిస్.. కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన జురెల్
సాల్ట్ ఔట్ తర్వాత కోహ్లీ గేర్ మార్చాడు. వరుస బౌండరీలతో హోరెత్తించాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని పడిక్కల్ సహాయంతో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. పడిక్కల్ (40), కోహ్లీ రెండో వికెట్ కు అజేయంగా 83 పరుగులు జోడించడం విశేషం. రాజస్థాన్ బౌలర్లలో కార్తికేయకు ఏకైక వికెట్ దక్కింది. ఈ టోర్నీలో బెంగళూరుకు ఆరు మ్యాచ్ ల్లో ఇది నాలుగో విజయం కాగా.. రాజస్థాన్ కు ఆరు మ్యాచ్ ల్లో ఇది నాలుగో ఓటమి.
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల డీసెంట్ టోటల్ చేయగలిగింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (47 బంతుల్లో 75:10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, హేజల్ వుడ్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.
Set up by Salt, finished by Kohli & Padikkal 👊
— ESPNcricinfo (@ESPNcricinfo) April 13, 2025
RCB wrap up a commanding away win https://t.co/7FBkGh3xi9 | #RRvRCB | #IPL2025 pic.twitter.com/VYcEu8eVJW