DC vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB.. సాల్ట్‌ను పక్కన పెట్టారుగా

DC vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB.. సాల్ట్‌ను పక్కన పెట్టారుగా

ఐపీఎల్ 2025లో ఆదివారం (ఏప్రిల్ 27) బ్లాక్ బాస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌, రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న ఇరు జట్లు.. ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేస్ లో మరింత ముందుకెళ్తుంది. చెరో ఆరు విజయాలతో జోరు మీదున్న ఈ ఇరు జట్లు నేడు గెలిస్తే 14 పాయింట్లతో అగ్ర స్థానంలోకి దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది సాల్ట్ స్థానంలో జాకబ్ బెతేల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఢిల్లీ జట్టులో డుప్లెసిస్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు.  

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): 

విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్