
ఐపీఎల్ 18వ ఎడిషన్ తొలి మ్యాచ్ ప్రారంభమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సొంతగడ్డపై కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాయి.
ఇరు జట్లలో ఫారెన్ ప్లేయర్స్ ను ఒకసారి పరిశీలిస్తే.. బెంగళూరు సాల్ట్, లివింగ్ స్టోన్, హేజల్ వుడ్, టిమ్ డేవిడ్ లతో బరిలోకి దిగుతుంది. మరోవైపు కోల్‌కతా డికాక్, నరైన్, రస్సెల్, స్పెన్సర్ జాన్సెన్ లు తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ALSO READ | IPL 2025: రెండు కాదు అంతకుమించి .. ఐపీఎల్ కొత్త సూపర్ ఓవర్ రూల్ ఇదే!