రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త తరం బుల్లెట్ బండిని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్స్ షోరూం ధర రూ.1.73 లక్షలు. స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.1.97 లక్షలు. టాప్-స్పెక్ బ్లాక్ గోల్డ్ వేరియంట్ ధర రూ.2.16 లక్షలు. బుకింగ్స్ మొదలయ్యాయి.
దీనికి 349 సీసీ ఎయిర్- ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 20 బీహెచ్‌పీ పవర్‌ను, 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. మొత్తం ఐదు గేర్లు ఉంటాయి.