
క్లాసిక్ 650 ట్విన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.37 లక్షలు– రూ. 3.50 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉంది. ఈ బండిలో 648సీసీ ఇంజిన్ అమర్చారు. ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను వాడారు.
ఇది 47హెచ్‌పీ పవర్‌ను , 52.3ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. క్లాసిక్ ట్విన్ బరువు 243 కిలోలు. అత్యంత బరువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌గా ఇది నిలిచింది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.