దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాలు ఫిబ్రవరి నెలలో పెరిగాయి. మొత్తం 75వేల 935 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అమ్మకాల్లో వృద్ది 6 శాతం పెరిగింది. దేశీయంగా 67వేల 922 యూనిట్లు అమ్ముడుపోగా.. ఎగుమతుల్లో 13 శాతం వృద్దిని సాధించాయి. 350 సీసీ విభాగంలో 66వేల 157 యూనిట్లు, 350సిసి మించిన మోడళ్లలో 9వేల 778 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 22 శాతం అమ్మకాలు తగ్గాయి.
ఐషర్ మోటార్ ఫ్లాగ్ షిప్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ ఫీల్డ్ .. ఫిబ్రవరి 2024 నెలలో మొత్తం 75వేల 935 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. ఇదిగత ఫిబ్రవరితో పోలిస్తే 6 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఎగుమతుల్లో 13 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం 8వేల 013 యూనిట్లను ఎగుమతి చేసింది.
ఓవరాల్ గా చూస్తే.. ఏప్రిల్ 2023 నుంచి ఫిబ్రవరి 2024 వరకు స్థిరమైన వృద్ధిని ప్రదర్శించింది. 350cc వరకు ఉన్న మోడల్స్ 11 శాతం పెరుగుదలతో 7లక్షల 45వేల 724 యూనిట్లను చేరుకున్నాయి. అయితే 350cc కంటే ఎక్కువ ఉన్నవి 3 శాతం వృద్ధిని సాధించాయి. మొత్తం 91వేల 457 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ 2023 నుంచి ఫిబ్రవరి 2024 వరకు మొత్తం సంచిత అమ్మకాలు 8లక్షల 37వేల 181 యూనిట్లు. ఇది 10 శాతం వృద్ధిని సూచిస్తుంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350, మెటోర్ 350లతో సహా 350 cc వరకు సామర్థ్యం కలిగిన మోడల్స్ స్థిరమైన డిమాండ్ ను కొనసాగించాయి. అదేవిధంగా హిమాలయాస్ సిరీస్, షాట్ గన్650 , ఇంటర్ సెప్టర్ 650 వంటి 350cc కంటే ఎక్కువ ఇంజిన సామర్థ్యం ఉన్న మోడల్స్ మొత్తం అమ్మకాల పెంచడంతో కీలకంగా నిలిచాయి.