వీడియో: ఒక్క పరుగు ఇవ్వకుండానే 5 వికెట్లు.. బ్యాటర్లను వణికించిన మిస్టరీ స్పిన్నర్

వీడియో: ఒక్క పరుగు ఇవ్వకుండానే 5 వికెట్లు.. బ్యాటర్లను వణికించిన మిస్టరీ స్పిన్నర్

ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్​-2023లో హ్యాంప్​షైర్ జట్టు ఫైనల్ చేరింది. గురువారం వార్విక్​షైర్‌తో  జరిగిన తొలి సెమీస్‌లో.. హ్యాంప్​షైర్ ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హ్యాంప్​షైర్ స్పిన్నర్ లియామ్ డాసన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఒక్క పరుగు ఇవ్వకుండానే 5 వికెట్లు తీయడంతో పాటు.. మొత్తంగా 7 వికెట్లు పడగొట్టాడు. 

డాసన్‌ మాయాజాలం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన వార్విక్‌షైర్‌.. డాసన్‌ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 6.5 ఓవర్లు బౌలింగ్ చేసిన డాసన్‌.. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. తొలి 10 బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టిన అతను.. ఆ తరువాత మరో రెండు వికెట్లు పడగొట్టాడు. డాసన్ స్పిన్ మాయాజాలాన్ని వార్విక్​షైర్ బ్యాటర్లు ఏ రకంగాను ఎదొర్కొలేకపోయారు. బంతి వికెట్లను వెళ్లకుండా అడ్డుపడడానికే వారికి సమయం సరిపోయింది. 

అనంతరం 94 పరుగుల లక్ష్యాన్ని హ్యాంప్​షైర్ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. ఓపెనర్‌ ఫ్లెచా మిడిల్టన్‌ (54 నాటౌట్‌) అర్ధసెంచరీతో రాణించగా.. టామ్‌ ప్రైస్ 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హ్యాంప్​షైర్.. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 

33 లియామ్‌ ఏళ్ల డాసన్‌ ఇంగ్లండ్‌ జట్టు తరఫున 3 టెస్ట్‌లు, 6 వన్డేలు, 11 టీ20లు ఆడారు.