మ్యూజిక్ డైరెక్టర్ కొడుకుని కాలేజ్‌లో చెవి కొరికి ర్యాగింగ్

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకుపై సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేశారు. సంగీత దర్శకుడు ఆర్ పీ పట్నాయక్ కుమారుడు శంకర్ పల్లి లోని ICFAI యూనివర్సిటీ లో ఎంబీఏ థర్డ్ ఈయర్ చదువుతున్నాడు. అదే కాలేజ్ కు చెందిన సీనియర్ స్టూడెంట్ శ్యామ్ అతన్ని ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని వైష్ణవ్ యూనివర్సిటి యాజమాణ్యానికి కంప్లైయింట్ చేశారు. తనపైనే కంప్లైయింట్ చేస్తావా.. అని శ్యామ్ బస్ లో వైష్ణవ్ తో గొడవ పడ్డాడు. ఆవేశంలో శ్యామ్, వైష్ణవ్ చెవి కొరికగా.. రక్తస్రావం అయ్యింది. దీంతో తన కొడుకు వైష్ణవ్ ని కాలేజ్ లో ర్యాగింగ్ చేశారని ఆర్ పీ పట్నాయక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి శ్యాంపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ALSO READ | దేవర షో క్యాన్సిల్ చేశారని థియేటర్ ని ధ్వంసం చేసిన అభిమానులు..