పిల్లలకు ఆస్తులు కాదు సంస్కారం ఇవ్వాలి : ఆర్‌‌‌‌పీ పట్నాయక్

మిర్యాలగూడ, వెలుగు :  పేరెంట్స్‌‌ తమ పిల్లలకు ఆస్తులు కాదు మంచి సంస్కారం ఇవ్వాలని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సూచించారు. ఆదివారం నిర్వహించిన జనయేత్రి ఫౌండేషన్  తృతీయ వార్షికోత్సవ సభకు చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు తాము ఎలాగైనా బతుకుతామనే కాన్ఫిడెన్స్‌‌ ఇస్తే.. వాళ్లే ప్రయోజకులు అవుతారన్నారు.  జనయేత్రి ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ మునీర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో యువ నేత కర్నె శిరీష, రిటైర్డ్‌‌ ప్రిన్సిపాల్ అనుముల మధుసూదన్ రెడ్డి, డోనర్ సంపత్, రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సాజీదా ఖాన్, ఫౌండేషన్ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఉన్నారు.