నిషేధిత స్థలంలో కూర్చున్నందుకు ప్రశ్నించిన పోలీసును కాల్చి చంపిన ఘటన హర్యానాలోని హిసార్ లో జరిగింది. మనీష్ కుమార్ శర్మ అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) పోలీస్ సోమవారం డ్యూటీలో భాగంగా రైల్వే ట్రాక్ వెంట చెకింగ్ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో రైల్వే ట్రాక్ పై ఓ అయిదుగురు వ్యక్తులు కూర్చొని కనిపించారు. వెంటనే మనీష్ అక్కడికి వెళ్లి ఇక్కడెందుకు కూర్చున్నారని ప్రశ్నించాడు. దాంతో ఆ అయిదుగురిలోని ఒక వ్యక్తి గన్ తో మనీష్ పై కాల్పులు జరిపాడు. మనీష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ‘రైల్వే ట్రాక్ సమీపంలో కూర్చున్న ఐదుగురు వ్యక్తుల గురించి విచారించడానికి మనీష్ వెళ్ళినప్పుడు సందీప్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన సందీప్.. ఇటీవలే జైలు నుంచి పెరోల్‌పై విడుదలయ్యాడు. సందీప్ ని అరెస్టు చేశాం. మిగతా నలుగురిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని హిసార్ పోలీసు సూపరింటెండెంట్ జీఆర్. పునియా తెలిపారు.
For More News..