బుధవారం(ఏప్రిల్ 10) జైపూర్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. 197 పరుగుల ఛేదనలో గుజరాత్ వెనుకబడినప్పటికీ.. ఆఖరిలో రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22), రషీద్ ఖాన్(11 బంతుల్లో 24) నిలకడగా ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. విజయానికి చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో రషీద్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు.
ఈ ఓటమి బాధలో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు రూ.12 లక్షల జరిమానా విధించారు. కనీస ఓవర్ రేట్ ప్రకారం.. రాజస్థాన్ జట్టు ఒక ఓవర్ ఆలస్యంగా వేసింది. దీంతో అతనికి జరిమానా విధించారు. ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టుకు ఇదే మొదటి నేరం కావడంతో శాంసన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించబడింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఎలాంటి జరిమానా విధించబడలేదు.
Also Read :చీటింగ్ కేసు.. హార్దిక్ పాండ్యా సోదరుడు అరెస్ట్
అంతకుముందు, శాంసన్(68), రియాన్ పరాగ్ (78) రాణించడంతో రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
🚨 NEWS ALERT: Sanju Samson has been fined INR 12 Lakhs after Rajasthan Royals maintained a slow over rate during their match against Gujarat Titans.#SanjuSamson #RRvGT #IPL2024 #CricketTwitter pic.twitter.com/wgPa3Q4sGL
— InsideSport (@InsideSportIND) April 11, 2024