
ఐపీఎల్ లో ఇవాళ ( మార్చి 26 ) రాజస్థాన్ రాయల్స్ ( RR ), కోల్కతా నైట్ రైడర్స్ ( KKR ) తలపడనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఓటమి చవి చుసిన రాజస్థాన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైన కోల్కతా ఈ మ్యాచ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గౌహతిలోని బర్సపర స్టేడియంలో ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.
రియాన్ పరాగ్ కెప్టెన్సీలో బరిలో దిగుతున్న రాజస్థాన్.. రెహానే కెప్టెన్సీలో బరిలో దిగుతున్న కోల్కతా టీమ్స్ ఈ మ్యాచ్ లో ఇవాళ జరిగే మ్యాచ్ లో గెలిచి.. ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రాజస్థాన్, కోల్కతా మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది.. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందో ఇప్పుడు చూద్దాం.
రాజస్థాన్, కోల్కత హెడ్ టు హెడ్ రికార్డ్:
రాజస్థాన్, కోల్కత జట్లు ఇప్పటిదాకా 28 సార్లు హెడ్ టు హెడ్ తలపడగా.. రాజస్థాన్ 12 మ్యాచుల్లో గెలుపొందితే.. కోల్కత 14 గెలుపొంది పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య 2 మ్యాచులు టై అయ్యాయి. అయితే.. 2024లో రాజస్థాన్ కోల్కత మధ్య జరిగిన చివరి మ్యాచ్ లో 2 వికెట్లతో రాజస్థాన్ విజయం సాధించింది.
Also Read:-1 రన్స్ తేడాతో గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ విక్టరీ..
ఇకపోతే.. బర్సపర పిచ్ బాటింగ్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది.. ఇవాళ వాతావరణం పొడిగా ఉంటూ 34 డిగ్రీల గరిష్ట, 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది హ్యూమిడిటీ లెవెల్స్ 41 శాతంగా ఉండగా.. గంటకు 11కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది.ఈ క్రమంలో మ్యాచ్ కి ఎలాంటి ఆటంకం కలిగే అవకాశం లేదు కాబట్టి ఇవాళ్టి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీం గనక భారీ టార్గెట్ సెట్ చేస్తే.. ఈజీగా గెలిచే ఛాన్స్ ఉందని చెప్పచ్చు.