
- క్వింటన్ సూపర్ బ్యాటింగ్.. ఆకట్టుకున్న కేకేఆర్ బౌలర్లు
గువాహటి: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్–18లో బోణీ చేసింది. రాజస్తాన్ రాయల్స్ మళ్లీ ఓడింది. ఛేజింగ్‌లో క్వింటన్ డికాక్ (61 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 నాటౌట్) చెలరేగడంతో.. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో రాయల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 151/9 స్కోరు చేసింది.
ధ్రువ్ జురెల్ (28 బాల్స్‌లో 5 ఫోర్లతో 33), యశస్వి జైస్వాల్ (24 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29), రియాన్ పరాగ్ (15 బాల్స్‌లో 3 సిక్స్‌లతో 25) మెరుగ్గా ఆడారు. తర్వాత కోల్‌కతా 17.3 ఓవర్లలో 153/2 స్కోరు చేసింది. రఘువంశీ (22 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. డికాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రాయల్స్ తడబాటు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ బ్యాటర్లను కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. తొలి బాల్‌నే ఫోర్‌గా మలిచిన యశస్వి ఉన్నంతసేపు వేగంగా ఆడినా.. సంజూ శాంసన్ (13) మళ్లీ నిరాశపర్చాడు. నాలుగో ఓవర్‌లో వైభవ్ అరోరా (2/33) అతడిని క్లీన్ బౌల్డ్ కావడంతో తొలి వికెట్‌కు 35 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో రియాన్ పరాగ్ మెరుగ్గా ఆడే ప్రయత్నం చేశాడు. ఐదో ఓవర్‌లో యశస్వి ఇచ్చిన క్యాచ్‌ను హర్షిత్ రాణా డ్రాప్ చేశాడు. ఆరో ఓవర్‌లో పరాగ్, జైస్వాల్ చెరో సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లేలో రాజస్తాన్ 54/1 స్కోరు చేసింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (2/17) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.
8వ ఓవర్లో పరాగ్‌ను ఔట్ చేసి రెండో వికెట్‌కు 34 రన్స్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఆపై హర్షిత్ రాణా (2/36).. యశస్విని వెనక్కి పంపాడు. పదో ఓవర్లో వరుణ్.. వానిందు హసరంగ (4) వికెట్ కూడా తీశాడు. ఆ వెంటనే మొయిన్ అలీ (2/23) దెబ్బకు నితీశ్ రాణా (8) పెవిలియన్‌కు చేరడంతో రాజస్తాన్ 82/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. శుభమ్ దూబే (9)తో కలిసి చకచకా సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదాడు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు 28 రన్స్ జోడించి15వ ఓవర్‌లో దూబే వెనుదిరిగాడు. హెట్‌మయర్ (7) ఫెయిలైనా చివర్లో జోఫ్రా ఆర్చర్ (16) వేగంగా ఆడటంతో రాయల్స్ 150 మార్క్‌ను అందుకుంది.
డికాక్ జోరు..
ఛేజింగ్‌లో కోల్‌కతాకు మెరుగైన ఆరంభం దక్కింది. తొలి ఓవర్‌లో రెండు రన్సే వచ్చినా ఆ తర్వాతి నుంచి డికాక్ బౌండ్రీలు, సిక్స్‌లతో రెచ్చిపోయాడు. రెండో ఎండ్‌లో మొయిన్ అలీ (5) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసినా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. పవర్‌ప్లేలో 40/0తో నిలిచిన కేకేఆర్.. ఏడో ఓవర్‌లో అలీ రనౌటయ్యాడు. తొలి వికెట్‌కు 41 రన్స్ జతయ్యాయి. స్టార్టింగ్‌లో నెమ్మదిగా ఆడిన కెప్టెన్ అజింక్యా రహానె (18) తర్వాత వేగం పెంచే ప్రయత్నం చేశాడు.
ఈ ఇద్దరి జోరుతో ఫస్ట్ టెన్‌లో కేకేఆర్ 70/1 స్కోరు చేసింది. 11వ ఓవర్‌లో హసరంగ రహానెను ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 29 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. హసరంగ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన డికాక్ 35 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే మరో సిక్స్, 13వ ఓవర్‌లో రెండు ఫోర్లతో జోరు పెంచాడు. కొత్తగా క్రీజులోకి వచ్చిన రఘువంశీ సింగిల్స్‌తో అండగా నిలవడంతో 15 ఓవర్లలో స్కోరు 118/2కు పెరిగింది. ఇక విజయానికి 30 బాల్స్‌లో 34 రన్స్ అవసరమైన దశలో 18వ ఓవర్‌లో డికాక్ 4, 6, 6 దంచాడు. రఘువంశీతో కలిసి మూడో వికెట్‌కు 83 రన్స్ జత చేసి ఈజీగా విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 151/9 (ధ్రువ్ జురెల్ 33, యశస్వి జైస్వాల్ 29, పరాగ్ 25, వరుణ్ చక్రవర్తి 2/17).
కోల్‌కతా: 17.3 ఓవర్లలో 153/2 (డికాక్ 97*, రఘువంశీ 22*, హసరంగ 1/34).