నిరుద్యోగులకు గుడ్ న్యూస్ టెన్త్, ఐటీఐ ఉంటే చాలు..రైల్వేలో 9970 ఉద్యోగాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్  టెన్త్, ఐటీఐ ఉంటే చాలు..రైల్వేలో 9970 ఉద్యోగాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇండియన్ రైల్వేలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను ప్రకటించింది రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో మొత్తం 9వేల 970 అస్టిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 10 తరగతి ఉత్తీర్ణతలో పాటు ఐటిఐ లేదా ఇంజినీరింగ్ డిప్లమాలేదా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఏప్రిల్ 10నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.ఎంపిక ప్రక్రియలో CBT, CBAT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు మే 9, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ALSO READ | బీఈ, బీటెక్ అర్హతతో మేనేజర్ జాబ్స్.. ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు..

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు మొత్తం 9,970 ఖాళీలు ఉన్నాయి. వీటిలో తూర్పు కోస్ట్ రైల్వే, తూర్పు రైల్వే , సౌత్ ఈస్టర్న్ రైల్వేలలో ఎక్కువ పోస్టులు కేటాయించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ అయిన సికింద్రాబాద్ కు 989 పోస్టులు కేటాయించారు. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ITI  ఉండాలి లేదా సంబంధిత రంగంలో ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే దరఖాస్తుదారులు జూలై 1, 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది.