Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియన్​ రైల్వే, రైల్వే రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3,445 ఖాళీలను భర్తీకీ సంబంధించిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌) నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. 

పోస్టులు–ఖాళీలు: మొత్తం 3,445 పోస్టుల్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990, ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్/ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మాక్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్/ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కనీసం 50 శాతం మాక్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

ALSO READ : Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్‌‌‌‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌‌‌‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.rrbapply.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.