రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందుతోంది. 32వేల 438 గ్రూప్-డి రైల్వే ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఈ భర్తీ చేపట్టనున్నారు. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025, జనవరి 23 నుండి ప్రారంభమైంది.
మొత్తం పోస్టులు: 32,438
విభాగాల వారీగా ఖాళీలు:
- ట్రాక్ మెయింటెయినర్ - 13,187
- పాయింట్స్‌మన్- 5,058
- అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799
- అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301
- అసిస్టెంట్ పీ-వే- 247
- అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ)- 2587
- అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్)- 420
- అసిస్టెంట్ (వర్క్‌షాప్)- 3077
- అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ)- 2012
- అసిస్టెంట్ టీఆర్‌డీ- 1381
- అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950
- అసిస్టెంట్ ఆపరేషన్స్- (ఎలక్ట్రికల్)- 744
- అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ- 1041
- అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్‌షాప్)- 625
అర్హతలు: పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా, NCVT జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉతీర్ణులై ఉండాలి. దాంతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01/ 01/ 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం SC/ST/OBC/ PH/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500.. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. అభ్యర్థి CBTకి హాజరైన తరువాత బ్యాంక్ ఛార్జీలు మినహా మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ప్రారంభ జీతం: నెలకు రూ.18,000.
ముఖ్య తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/01/ 2025
- దరఖాస్తుకు చివరి తేదీ: 22/ 02/ 2025
మరిన్ని పూర్తి వివరాలకు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చావగలరు. Railway Recruitment Board అధికారిక వెబ్‌సైట్ లింక్.