
మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి.
మొత్తం పోస్టులు(1036): పోస్టు గ్యాడ్యుయేట్ టీచర్స్187, సైంటిఫిక్ సూపర్వైజర్3, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 338, చీఫ్ లా అసిస్టెంట్54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్18, సైంటిఫిక్అసిస్టెంట్/ట్రైనింగ్ 2, జూనియర్ ట్రాన్స్‌లేటర్130, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 03, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59, మ్యూజిక్ టీచర్10, ప్రైమరీ రైల్వే టీచర్3, లైబ్రేరియన్ 188, అసిస్టెంట్ టీచర్2, ల్యాబొరేటరీ అసిస్టెంట్/ స్కూల్ 07, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్–3:12 పోస్టులు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్, డీఎడ్, బీఎడ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, టీచింగ్ స్కూల్ టెస్ట్, ట్రాన్స్లేషన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
అప్లికేషన్: 2025, జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి. అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఈబీసీ, మైనార్టీ అభ్యర్థులకు రూ.250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ నెల 16 దరఖాస్తులకు ఆఖరు తేదీ.