ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. 1,036 మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, కుక్, PGT, TGT, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ మొదలైన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 1,036
విభాగాల వారీగా ఖాళీలు:
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT):187
- సైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్): 03
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT): 338
- చీఫ్ లా అసిస్టెంట్: 54
- పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20
- ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం): 18
- సైంటిఫిక్ అసిస్టెంట్/ట్రైనింగ్: 02
- జూనియర్ ట్రాన్సలేటర్ (హిందీ): 130
- సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్: 03
- స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్స్పెక్టర్: 59
- లైబ్రేరియన్: 10
- సంగీత ఉపాధ్యాయురాలు (మహిళలు): 03
- ప్రైమరీ రైల్వే టీచర్: 188
- అసిస్టెంట్ టీచర్ (మహిళ): 02
- ప్రయోగశాల సహాయకుడు: 07
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ & మెటలర్జిస్ట్): 12
విద్యార్హతలు: ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు అర్హులు. అనగా LLB, B.Ed, BP Ed, B.El.Ed, BE/B.Tech, BCA, MCA, M.Ed, మాస్టర్ డిగ్రీ వంటి పై చదువులు చదివిన అర్హులన్నమాట. ఇప్పుడు తుది పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేయకూడదు.
వయో పరిమితి: 18 నుండి 48 ఏళ్ల మధ్య ఉండాలి(అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌ను బట్టి గరిష్ట వయోపరిమితి మారుతుంది). ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయస్సులో సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు: SC/ ST/ PWD/ మహిళలు / ట్రాన్స్ జెండర్ / మైనారిటీలు / EWS అభ్యర్థులు రూ.250.. ఇతరులు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తంలో పరీక్షకు హాజరైన అనంతరం బ్యాంకు చార్జీలు తీసేసి మిగిలిన మొత్తాన్ని రీఫండ్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ (SST)/ అనువాద పరీక్ష (TT)/ పర్ఫార్మెన్స్ టెస్ట్ (PT)/ టీచింగ్ స్కిల్ టెస్ట్ (TST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ఇంత ప్రాసెస్ ఉంటదా అనుకోకండి..! స్టెనోగ్రాఫర్ పోస్టులకు స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, ట్రాన్స్ లేటర్ పోస్టులకు అనువాద పరీక్ష.. ఇలా పోస్టులను బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07/ 01/ 2025
- దరఖాస్తులకు చివరి తేది: 06/ 02/ 2025
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. RRB Ministerial & Isolated Categories Recruitment 2024 మీరు ఏ రైల్వే జోన్‌లో అయితే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో.. ఆ జోన్‌ను ఎంచుకోండి.
సికింద్రాబాద్ జోన్‌లో దరఖాస్తు చేయాలనుకున్నవారు Detailed Notification ఇక్కడ క్లిక్ చేయండి.