రైల్వేలో 9,144 టెక్నీషియన్​​ కొలువులు

రైల్వేలో 9,144 టెక్నీషియన్​​ కొలువులు

రైల్వే జోన్లలో టెక్నీషియన్ కొలువులకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇప్పటికే 9,144  ఖాళీలకు నోటిఫికేషన్​ జారీ చేయగా, అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 959 ఖాళీలున్నాయి. అత్యధికంగా చెన్నై జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2716; అత్యల్పంగా సిలిగురి జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 91 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2వ తేదీ నుంచి అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16వ తేదీ వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు. 

కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.

పోస్టులు–ఖాళీలు: మొత్తం 14,298 పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): 1,092, టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): 8,052, టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీయూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): 5,154 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు: టెక్నీషియన్ గ్రేడ్-–I సిగ్నల్: బీఎస్సీ, బీఈ/ బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్–-III: టెన్త్​, ఐటీఐ లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు టెక్నీషియన్ గ్రేడ్-–I సిగ్నల్ పోస్టులకు 18 నుంచి -36 ఏళ్లు. టెక్నీషియన్ గ్రేడ్-–III పోస్టులకు 18 నుంచి -33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. జీతం నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్–-III పోస్టులకు రూ.19,900 బేసిక్​ వేతనం చెల్లిస్తారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 2 నుంచి అక్టోబర్​ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.rrbsecunderabad.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

ప్రిపరేషన్​ స్ట్రాటజీ

మ్యాథ్స్​​: అభ్యర్థులకు మ్యాథ్స్​​ కష్టంగా అనిపించినప్పటికీ పద్ధతి ప్రకారం ప్రాక్టీస్​ చేస్తే సమస్యలు సాల్వ్​ చేయడం సులువు. బేసిక్​ అంశాలతో ప్రిపరేషన్​ మొదలు పెట్టి కాన్సెప్ట్​ల మీద కమాండ్​ వచ్చిన తర్వాత షార్ట్​కట్స్​పై దృష్టి పెట్టాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే 30 శాతం ప్రిపరేషన్​ పూర్తయినట్లే. ఒక ప్రశ్నకు నిమిషంలోపల ఆన్సర్​ చేయగలగాలి. మ్యాథమెటిక్స్​ టాపిక్స్​ ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో సాధిస్తే సులభంగా అర్థమవుతాయి. 

బేసిక్​ అర్థమెటిక్​ ఆపరేషన్స్​లో బోడ్​మాస్​ను ఉపయోగించి చేసే సింప్లిఫికేషన్స్​, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు ఉంటాయి.  ఎల్​సీఎం, హెచ్​సీఎఫ్​, పర్సంటేజీలు, రేషియో ప్రపోర్షన్​, ఏజస్, ప్రాఫిట్​​, లాస్​ అండ్​ డిస్కౌంట్​, టైమ్​ అండ్​ వర్క్​, పైప్స్​ అండ్​ సిస్టర్న్, టైమ్​, స్పీడ్​, డిస్టాన్స్​, ట్రైన్స్​, బోట్స్​ అండ్​ స్ట్రీమ్స్​, సింపుల్ అండ్​ కాంపౌండ్​ ఇంట్రెస్ట్​, మెన్స్యూరేషన్​, ట్రిగనోమెట్రి, బేసిక్​ ఆల్​జీబ్రా, బేసిక్​ జామెట్రి, బేసిక్​ స్టాటిస్టిక్స్​ టాపిక్స్ లలో ​ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.

జనరల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ రీజనింగ్​: ఈ ఎగ్జామ్​లో అన్ని సెక్షన్లలో తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు స్కోర్​ చేసే సెక్షన్​ జనరల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ రీజనింగ్​. ఇందులో ఒక టాపిక్​కు మరో దానికి లింక్​ ఉండదు. అన్ని ఇండిపెండెంట్​ అంశాలు. ఒక్కో చాప్టర్​లోని కాన్సెప్ట్​ను పూర్తిగా అవగతం చేసుకున్నాకే మరో చాప్టర్​ స్టార్ట్​ చేస్తే బాగుంటుంది. ఈ సెక్షన్​ నుంచి వచ్చే ప్రశ్న ఏదైనా దాన్ని 45 సెకండ్లలో సాల్వ్​ చేసేలా ప్రిపేరైతే విజయం సాధించవచ్చు. 

గత పరీక్ష పత్రాలను పరిశీలిస్తే. కోడింగ్​ అండ్​ డికోడింగ్​, వెన్​ డయగ్రామ్స్​, అనలాజిస్​, క్లాసిఫికేషన్​, ఆల్ఫాబెటికల్​ అండ్​ నంబర్​ సిరీస్​, సీటింగ్​ అరేంజ్​మెంట్స్​, పజిల్స్​, స్టేట్​మెంట్​ అండ్​ కన్​క్లూజన్​, కోర్స్​ ఆఫ్​ యాక్షన్​ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. మ్యాథమెటికల్​ ఆపరేషన్స్​, రక్త సంబంధాలు, సిలాగిమ్స్​, డైరెక్షన్స్​, ర్యాంకింగ్స్​, డెసిషన్​ మెకింగ్​, డేటా సఫీషియెన్సీ చాప్టర్ల నుంచి కొంత తక్కువ అడుగుతున్నారు. ఈ టాపిక్స్​ అన్ని పూర్తి స్థాయిలో ప్రిపేరైన తర్వాత ప్రీవియస్​ ఇయర్స్​ టాపిక్​ వైజ్​ క్వశ్చన్స్​(కిరణ్​ పబ్లికేషన్స్​) బుక్​ ప్రాక్టీస్​ చేయాలి.

జనరల్​ అవేర్​నెస్​: తక్కువ సమయంలో ఆన్సర్​ చేయగలిగే సెక్షన్​ జనరల్​ అవేర్​నెస్​. మార్కుల పరంగా ఈ సెక్షన్​ కీలక డిసైడర్​ అవుతుంది. బయాలజీలో వ్యాధులు, శాస్త్రీయనామాలు, ఇన్​వెన్షన్స్​, మానవశరీరం టాపిక్స్​ చూసుకోవాలి. కెమిస్ట్రీలో ఆటమ్​, ఆసిడ్​, బేస్​, సాల్ట్​, మెటల్​ అండ్​ నాన్​మెటల్​, పీచ్​ స్కేల్​, పిరియాడిక్​ టేబుల్, కెమికల్​ ఫార్ములాలు స్టడీ చేయాలి. ఫిజిక్స్​లో మోషన్​,  లైట్, గ్రావిటి, ఎనర్జి, హీట్​ టాపిక్స్​పై దృష్టి పెట్టాలి. హిస్టరీ నుంచి ఆర్ట్స్​ అండ్​ కల్చర్, బిల్డింగ్స్​ అండ్​ మాన్యుమెంట్స్​, ప్లేసెస్​, జాతీయోద్యమం, ఫేమస్​ పర్సనాలిటీస్ అంశాలు చదవాలి. జాగ్రఫీలో ఫిజకల్​, సోషల్​, ఎకనామిక్​ జాగ్రఫీ ఆఫ్​ ఇండియా, వరల్డ్​ చూసుకోవాలి. పాలిటీలో ఇండియన్​ పాలిటీ, గవర్నెన్స్​ అండ్​ కానిస్టిట్యూషన్​, ఎకానమీలో ప్రభుత్వ పథకాలు, యూఎన్​ఏ​ తదితర అంతర్జాతీయ సంస్థలు, ఇండియన్​ ఎకానమీ, కంపెనీలు, ఆర్బీఐ తదితర అంశాలపై ఫోకస్​ పెట్టాలి. కంప్యూటర్​ అండ్​ అప్లికేషన్స్​ విభాగం నుంచి కంప్యూటర్​ గురించి బేసిక్​ ప్రశ్నలు ఇస్తారు.

జీకే అండ్​ కరెంట్​ ఎఫైర్స్​: స్టాటిక్​ జీకేలో గవర్నర్/స్టేట్​ క్యాపిటల్​, క్యాపిటల్​ అండ్​ కరెన్సీ, రివర్స్​ అండ్​ సిటీస్​, డ్యాంలు, నేషనల్​ పార్కులు, బయోడైవర్సిటీ, జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలు, డిస్కవరీ అండ్​ ఇన్​వెన్షన్స్​, సైంటిఫిక్​ ఇన్​స్ట్రుమెంట్స్​, మిలటరీ ఆపరేషన్స్​ తదితర అంశాలు చూసుకోవాలి.​ కరెంట్​ ఎఫైర్స్​లో ముఖ్యమైన తేదీలు, ఎన్​ఆర్​సీ, సీఈఈ, ముఖ్యమైన సదస్సులు, అవార్డులు, బడ్జెట్​, స్పోర్ట్స్​​ పర్సన్స్​, అపాయింట్​మెంట్స్​ అండ్​ డెత్స్​ ఫాలో కావాలి.

సెలెక్షన్​: రాత పరీక్ష (కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రంలో జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10 ప్రశ్నలు, 10 మార్కులు), జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (15 ప్రశ్నలు, 15 మార్కులు), బేసిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంప్యూటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (20 ప్రశ్నలు, 20 మార్కులు), మ్యాథ్స్​ (20 ప్రశ్నలు, 20 మార్కులు), బేసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35 ప్రశ్నలు, 35 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథ్స్​ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10 ప్రశ్నలు, 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి.

కంప్యూటర్​ మరియు అప్లికేషన్స్ బేసిక్స్: కంప్యూటర్స్ ఆర్కిటెక్చర్; ఇన్​పుట్​, అవుట్​ఫుట్​ డివైజెస్​, విండోస్​, యూనిక్స్​, లైనెక్స్​, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఎస్​ ఆఫీస్, ఇంటర్నెట్ మరియు ఇ–మెయిల్; వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు & వెబ్ బ్రౌజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు; కంప్యూటర్ వైరస్ గురించి అవగాహన ఉండాలి. 

బేసిక్​ సైన్స్ అండ్​ ఇంజనీరింగ్: ఫిజిక్స్ ఫండమెంటల్స్- యూనిట్లు, కొలతలు, ద్రవ్యరాశి, బరువు, సాంద్రత, పని, శక్తి మరియు శక్తి, వేగం మరియు వేగం, వేడి మరియు ఉష్ణోగ్రత; విద్యుత్తు మరియు అయస్కాంతత్వం- ఎలక్ట్రిక్ ఛార్జ్, ఫీల్డ్ మరియు ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మరియు పొటెన్షియల్ డిఫరెన్స్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కండక్టర్స్, నాన్-కండక్టర్స్/ఇన్సులేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఓమ్స్​ లా దాని పరిమితులు, శ్రేణిలో ప్రతిఘటనలు మరియు ఒక సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సమాంతరంగా, రీసిఫికేషన్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎనర్జీ మరియు పవర్ (వాటేజ్), ఆంపియర్స్ లా, మోవింగ్ చార్జ్​​పార్టికల్ మరియు లాంగ్ స్ట్రెయిట్ కండక్టర్లపై అయస్కాంత శక్తి, విద్యుదయస్కాంత ప్రేరణ, ఫారడే చట్టం మరియు విద్యుదయస్కాంత ప్రవాహం, అయస్కాంత క్షేత్రం, మాగ్నెటిక్ ఇండక్షన్; ఎలక్ట్రానిక్స్ మరియు కొలతలు- ప్రాథమిక ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు , మైక్రోకంట్రోలర్, మైక్రోప్రాసెసర్, ఎలక్ట్రానిక్ కొలతలు, కొలత వ్యవస్థలు మరియు సూత్రాలు, రేంజ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్ మెథడ్స్ వంటి అంశాల గురించి తెలుసుకోవాలి.