ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR, పాట్నా) 1,154 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కావున, మంచి మార్కులతో పదో తరగతి పాసైన వారికి ఇది మంచి అవకాశం. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు 2025, ఫిబ్రవరి 14లోపు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1,154
డివిజన్ల వారీగా ఖాళీలు
- దానాపూర్: 675
- ధన్‌బాద్: 156
- పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్: 64
- సోన్పూర్: 47
- సమస్తిపూర్: 46
- ప్లాంట్ డిపో (Pt దీన్ దయాళ్): 29
- క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హర్నాట్: 110
- మెకానికల్ వర్క్‌షాప్, సమస్తిపూర్: 27
విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. దాంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి.
వయోపరిమితి: 01/ 01/ 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం, రిజర్వ్ డ్ క్యాటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కలదు.
ఖాళీలు గల ట్రేడ్లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (ఢీజిల్), మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్.
Also Read :- అమెరికా నుంచి తరిమేస్తున్న ట్రంప్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు: రూ 100 చెల్లించాలి. SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు చేయు విధానం: ఆన్ లైన్.
ఎంపిక ప్రక్రియ: మొదట మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారులకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఇలా వడపోత చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రైల్వే నిబంధనల ప్రకారం అప్రెంటిస్‌షిప్ వ్యవధిలో స్టైఫండ్ చెల్లిస్తారు.
ముఖ్య తేదీలు:
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: 25/ 01/ 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: 14/ 02/ 2025
రిజిస్ట్రేషన్ చేసే సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది పత్రాలను అప్లోడ్ చేయాలి.
- పదో తరగతి మార్కు షీట్
- జనన ధృవీకరణ పత్రం
- ఐటీఐ సర్టిఫికేట్
- కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
నోటిఫికేషన్, దరఖాస్తు చేయడం కోసం ఇక్కడ క్లిక్ (RRC ECR Apprentice Recruitment 2025) చేయండి.