గుడ్ న్యూస్ : RRI లో మంచి జీతంతో ఇంజినీర్ ఉద్యోగాలు

గుడ్ న్యూస్ : RRI లో మంచి జీతంతో ఇంజినీర్ ఉద్యోగాలు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రామన్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 
పోస్టుల సంఖ్య: 11
పోస్టులు:  ఇంజినీర్– ఏ(ఎలక్ట్రానిక్స్) 03, ఇంజినీర్–ఏ(ఫొటోనిక్స్) 02, ఇంజినీరింగ్ అసిస్టెంట్– సి(సివిల్) 01, అసిస్టెంట్ 04, అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ ‌‌01. 
ఎలిజిబిలిటీ:  పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీహెచ్ఎం, బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:  ఇంజినీర్ ఏ(ఎలక్ట్రానిక్స్), ఇంజినీర్ ఏ(ఫొటోనిక్స్) 35 ఏండ్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ సి(సివిల్) 28 ఏండ్లు, అసిస్టెంట్ 28 ఏండ్లు, అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ ‌30 ఏండ్లు మించరాదు.  నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 14.
సెలెక్షన్ ప్రాసెస్: ఆబ్జెక్టివ్ టెస్ట్, సబ్జెక్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు rri.res.inలో సంప్రదించగలరు.