ఆర్ఆర్ఆర్ నటుడు కన్నుమూత

 ఆర్ఆర్ఆర్ నటుడు కన్నుమూత

ఆర్ఆర్ఆర్ నటుడు రే  స్టీవెన్సన్ (58) ఇటలీలో కన్నుమూశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న పి.ఆర్ తెలియ‌జేశారు. అయితే ఆయన ఎలా చ‌నిపోయార‌నే దానికి కార‌ణాలు తెలియ‌టం లేదు.  రే  స్టీవెన్సన్ మృతి పట్ల ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

 ‘మీరు చ‌నిపోయార‌నే వార్త మ‌మ్మ‌ల్ని షాక్‌కి గురిచేసింది. మీరెప్పటికీ మా హృద‌యాల్లో నిలిచే ఉంటారు. మీ ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నాం’  అని ట్వీట్ చేసింది.ఆర్ఆర్ఆర్​ సినిమాలో గవర్నర్‌ స్కాట్‌ బక్​స్టన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 

1964 మే 25న లిస్సర్న్  లో పుట్టిన రే  స్టీవెన్సన్ .. 8 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ థియేటర్ స్కూల్ లో చేరారు.  90వ దశకంలో  టీవీ షోలలో తన కెరీర్‌ను స్టార్ చేశారు స్టీవెన్ స‌న్‌. 2000 సంవత్సరం నుండి హాలీవుడ్ చిత్రాలలో అవ‌కాశాలు వ‌చ్చాయి.

అక్కడ త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించి గుర్తింపును ద‌క్కించుకున్నారు.. ఆంటోయిన్ ఫుక్వా 2004 అడ్వెంచర్ మూవీ ‘కింగ్ ఆర్థర్’ స్టీవెన్ మొదటి ప్రధాన చలన చిత్రం. అలాగే ‘నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్‌’లోనూ ఒకటైన డాగోనెట్‌గా కనిపించారాయన.