గతంలో డాక్యుమెంటరీస్ చాలానే వచ్చాయి. అయితే, మేకర్స్ కొంత కాలంగా వాటికీ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దీనికి తెరలేపాడు. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే తరువాత మరిన్ని డాక్యుమెంటరీ సిరీస్ చూసే అవకాశం దక్కుతుంది. ఇకపోతే ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ రేపు (Dec 20న) కొన్ని థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. రీసెంట్గా మేకింగ్ ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. దాంతో సినిమా పిచ్చోళ్ళంతా జక్కన్న మేకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా టికెట్ ప్రైస్ అందుబాటులోకి వచ్చాయి. డాక్యుమెంటరీ సింగల్ స్క్రీన్స్ లో కాకుండా ఓన్లీ ముల్టీఫ్లెక్ లో మాత్రమే రిలీజ్ కానుంది. ఈ డాక్యుమెంటరీకి రూ.200 నుంచి 300 వరుకు టికెట్ ప్రైస్ ఫిక్స్ చేసారు. బుక్ మై షోలో డాక్యుమెంటరీ సంబంధించిన టికెట్స్ అందుబాటులో ఉంచారు. ఈ డాక్యుమెంటరీ నిడివి 1 గంట 38 నిమిషాలు ఉంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
తెలుగు సినిమాగా మొదలై ఆస్కార్ లెవెల్‌కు ఆర్ఆర్ఆర్ ఎలా చేరింది? సినిమా రూపకల్పనలో యూనిట్ ఎదుర్కొన్న సవాళ్లు, మూవీ సాధించిన అవార్డులు, రికార్డుల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆర్‌ఆర్‌ఆర్’ గురించి ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను పంచుకోనుంది. 2022 మార్చిలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాదు ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుంది.
బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. ఇపుడు ‘బాహుబలి’,‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై మేకింగ్పై డాక్యుమెంటరీ రూపొందించడం విశేషం.