హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ హిట్టయితే.. సినిమాలోని పాపులర్ సాంగ్ ‘నాటు నాటు’కు స్టెప్పులేస్తానని రిలీజ్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్, అనిల్ రావిపూడికి ఆయన మాటిచ్చాడు. ఇప్పుడు చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో డ్యాన్స్ చేసి మాట నిలబెట్టుకున్నాడు. సోమవారం నిర్వహించిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడితో కలసి జక్కన్న స్టెప్స్ వేశాడు. రాజమౌళి డ్యాన్స్ చేస్తుంటే తారక్ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశాడు. ఇకపోతే, విడుదల రోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా పది రోజుల్లోనే రూ.900 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. బాహుబలి–2 పేరిట ఉన్న పలు రికార్డులను చెరిపేసిన ఈ సినిమా.. ఫుల్ రన్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Our Director @ssrajamouli fulfilled the promise he made to @Tarak9999 in @AnilRavipudi’s interview. #RRRMovie
— RRR Movie (@RRRMovie) April 4, 2022
THANK YOU
THANK YOU
THANK YOU….???? pic.twitter.com/d6iXFmxQ7y
మరిన్ని వార్తల కోసం: