జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను నేడు కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ను పరిచయం చేస్తూ హీరో రాంచరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తెలుగులోనే కాకుండా.. హిందీ, కన్నడ, మలయాళం, తమిల్ భాషలలో విడుదలయిన ఈ టీజర్‌కు రాంచరణే వాయిస్ ఇచ్చాడు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తున్నాడు.
‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి
నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి
వాడి పొగరు ఎగిరే జెండా
వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ
నా తమ్ముడు.. గోండు బెబ్బులి.. కొమురం భీం’
అంటూ రాంచరణ్ వాయిస్‌తో అదరగొట్టాడు.
Finally, here's the mighty Bheem!
A befitting return gift to you my dear brother @tarak9999!https://t.co/dsTSC7QoBO@ssrajamouli @RRRMovie #RamarajuForBheem #RRRMovie #BheemFirstLook
— Ram Charan (@AlwaysRamCharan) October 22, 2020
For More News..