
బెంగళూరు: మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్ డేట్ కోసం జూనియర్ ఎన్టీఆర్. రామ్ చరణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వారికి మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు కర్నాటకలోని చిక్బల్లాపూర్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ఐదు భాషల్లో విడుదల కానుంది. బాహుబలి రెండు పార్ట్ లతో పోల్చుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ పెద్ద రేంజ్ లో ఉంటుందని దర్శక ధీరుడు రాజమౌళి మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో అన్నాడు. తారక్ ఓ సూపర్ కంప్యూటర్ లాంటి వాడని రాజమౌళి మెచ్చుకున్నాడు. ఇక షూటింగ్ టైమ్ లో చాలాసార్లు చరణ్ తన నటనతో ఆశ్చర్యానికి గురి చేశాడని ప్రశంసించాడు. ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోల గురించి తానేం చెప్పలేనని.. ఈ విషయంపై డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకుంటారన్నాడు.
మరిన్ని వార్తల కోసం: