Oscar Awards 2024: ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ విజువల్స్.. ఇది కదా క్రేజ్ అంటే!

Oscar Awards 2024: ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ విజువల్స్.. ఇది కదా క్రేజ్ అంటే!

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఇండియన్ ప్రైడ్ మూవీ ఆర్ఆర్ఆర్(RRR) ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(Ntr) కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు సైతం సాధించి ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వరించింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా 94వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అయితే ఈసారి నుండి ఒక్క సినిమా కూడా ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడలేదు. అయినప్పటికి.. ఆస్కార్ వేదిక సాక్షిగా తెలుగు సినిమా పతాకం రెపరెపలాడింది. అది కూడా ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ వల్లే. కార్యక్రమంలో భాగంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీని అనౌన్స్ చేస్తున్న సమయంలో నాటు నాటు పాటను ప్లే చేశారు నిర్వాహకులు. అంతేకాదు.. యాక్షన్ సీక్వెన్స్ సంబందించిన వీడియోలో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ విజువల్స్ ను ప్లే చేశారు. 

ALSO READ :- మ్యాట్రిమోనీలో పెళ్లి చేసుకుని.. 25 లక్షలు కాజేసింది : సీరియల్ నటి ఐశ్వర్యపై భర్త కంప్లయింట్

దీంతో మరోసారి ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమా మెరిసింది. దీన్ని బట్టి చూస్తే హాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా హవా ఇంకా తగ్గినట్టుగా కనిపించడం లేదు. ఇక ఇదే విషయాన్నీ ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రేక్షకుల తో పంచుకున్నారు. ప్రస్తుతం టీమ్ షేర్ చేసిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చూసిన ఇండియన్ సినిమా లవర్స్, మరీ ముఖ్యంగా తెలుగు సినీ లవర్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇది కదా తెలుగు సినిమా క్రేజ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.