- రింగురోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితులను కాపాడాలి
- ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ (రూట్ మ్యాప్) మార్చాలి
- 300 ఇండ్లు కోల్పోకుండా అలైన్ మెంట్ మార్చాలి
యాదాద్రి భువనగిరి జిల్లా: ఆర్ఆర్ఆర్ రింగు రోడ్డు భూ నిర్వాసితులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. రింగురోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితులను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని రీజనల్ రింగ్ రోడ్డును రూట్ మ్యాప్ ను మార్చాలని, భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రూట్ మ్యాప్ వల్ల 300 ఇండ్లు కోల్పోయి రోడ్డునపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన భూములను కోల్పోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణత్యాగాలకు వెనుకాడబోమని చెప్పారు.