కస్టమ్స్‌‌ ఆఫీసర్ల కస్టడీ నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారం గాయబ్

జామ్​నగర్: ఇటీవల చెన్నైలో సీబీఐ కస్టడీలో ఉన్న 103 కిలోల బంగారం మిస్సైన మిస్టరీ వీడక ముందే గుజరాత్‌‌లోనూ అలాంటి ఘటనే జరిగింది. కస్టమ్స్‌‌ ఆఫీసర్ల కస్టడీ నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారం గాయబ్‌‌ అయ్యింది. అధికారుల కంప్లైంట్‌‌ మేరకు జామ్‌‌నగర్‌‌‌‌ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నరు. భుజ్​ కస్టమ్స్​ డివిజన్​కు చెందిన 3,149 గ్రాముల బంగారాన్ని 2001లో జామ్​నగర్​ ఆఫీసులో పెట్టారు. 2016లో లెక్కలు చూస్తే అందులోనుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారం మిస్సైంది. నాలుగేళ్లపాటు ఇంటర్నల్​ ఎంక్వైరీ చేసినా ఏమీ తేలకపోవడంతో చివరికి కంప్లెయింట్​ ఇచ్చారు.

For More News..

కరోనా నాశనానికి.. 33 డిగ్రీలు.. 30 నిమిషాలు!

ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జీహెచ్ఎంసీ అధికారుల ఐఫోన్ ఆశలకు బ్రేక్