- ఏసీబీకి చిక్కిన వరంగల్ జిల్లా సంగెం పీఆర్ ఏఈ
పర్వతగిరి (సంగెం), వెలుగు : బిల్డింగ్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈతో పాటు, అతడి ప్రైవేట్ అసిస్టెంట్‌ను ఏసీబీ ఆఫీసర్లు సోమవారం పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... సంగెం మండలం కుంటపల్లికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పేరున బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ పర్మిషన్, కుడా పర్మిషన్ కోసం ఇటీవల పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ కంకణాల రమేశ్‌ను కలిశాడు.
పర్మిషన్ ఇచ్చేందుకు రూ. 10 వేలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇస్తానని ఏఈ రమేశ్‌కు చెప్పడంతో ఆయన తన ప్రైవేట్ అసిస్టెంట్ గుగులోతు సారయ్యకు ఇవ్వాలని సూచించాడు.
దీంతో ఆ వ్యక్తి సోమవారం ఏఈ ప్రైవేట్ ఆఫీస్‌లో రమేశ్‌ను, సారయ్యను కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని వరంగల్ ఎస్‌పీఈ, ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు.