నిజాంపేట, వెలుగు : మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం తండాలో మద్యపానంపై నిషేధం విధించారు. శుక్రవారం సర్పంచ్ గేమ్ సింగ్ ఆధ్వర్వంలో పంచాయతీ పాలకవర్గం సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్ మాట్లాడుతూ తండాలో ఎవరూ లిక్కర్ అమ్మరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ లలితా రవి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
ALSO READ :ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 1.18 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి