ముంబై షిప్ యార్డులో రూ. 1000 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

ముంబై షిప్ యార్డులో రూ. 1000 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

ముంబైలోని నవీ షెవా ఓడరేవులో సుమారు రూ. 1000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే డ్రగ్స్ కు పేరుగాంచిన ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా వీటిని ముంబైకి అక్రమంగా రవాణా చేశారు. ప్లాస్టిక్ పైపులలో దాచిపెట్టి తీసుకొస్తున్న 191 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

“పోలీసులు కంటైనర్‌ను పరిశీలించినప్పుడు దానిలో నారింజ రంగు గన్నీ బ్యాగులు ఉన్నాయి. వాటి లోపల ఆయుర్వేద మందులు ఉన్నట్లు వాటిని తీసుకొస్తున్న వాళ్లు తెలిపారు. వాటిని చెక్క బాక్స్ లో సీల్ చేసి పెట్టారు. చెకింగ్ లో భాగంగా.. కట్టర్ సహాయంతో చెక్క బాక్స్ ఓపెన్ చేసి వెదురు బొంగులను పగులగొడితే.. వాటిలో ఆకుపచ్చ రంగు ప్లాస్టిక్ పైపు ఉంది. ఆ ప్లాస్టిక్ పైపు లోపల హెరాయిన్ పొడి ఉంది. ఎన్‌డిపిఎస్ కిట్‌ను ఉపయోగించి చేసిన పరీక్షలో ఇది హెరాయిన్ గా నిర్ధారించబడింది ” అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు మీనానాథ్ బోడకే మరియు కొండిభావు పాండురంగ్ గంజాల్‌ను స్థానిక కోర్టు ముందు హాజరుపరిచారు. వారికి కరోనా పరీక్షలు చేసి.. ఫలితాలు నెగిటివ్ రావడంతో వారిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్‌కు తరలించింది.

పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. నిందితుడు గతంలో కూడా 194 కేజీల హెరాయిన్ స్మగ్ల్ చేస్లూ 2001లో పంజాబ్ పోలీసులకు చిక్కినట్లు తేలింది.

For More News..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలి

సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ