మంత్రుల జీతాలు, గెస్టుల కోసం రూ.1,024.30 కోట్లు

మంత్రుల జీతాలు, గెస్టుల కోసం రూ.1,024.30 కోట్లు

కేంద్ర బడ్జెట్​లో మంత్రివర్గం, కేబినెట్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం ఖర్చులు, స్టేట్​గెస్ట్​ల ఆతిథ్యం కోసం రూ.1,024.30 కోట్లు కేటాయించారు. ఇది 2024-25లో కేటాయించిన రూ.1,021.83 కోట్ల కంటే కొంచెం ఎక్కువ. 

మంత్రుల ఖర్చుల కోసం మొత్తం రూ.619.04 కోట్లు కేటాయించారు. ఈ నిధులను కేబినెట్ మంత్రులు, మాజీ ప్రధానుల జీతాలు, ఇతర భత్యాలు, ప్రయాణ ఖర్చుల కోసం వినియోగిస్తారు. అలాగే, నేషనల్​సెక్యూరిటీ కౌన్సిల్​సెక్రటేరియెట్​కు రూ.182.75 కోట్లు కేటాయించారు. 

పీఎంఓ పరిపాలనా ఖర్చులకు రూ.70.91 కోట్లు కేటాయించారు. హాస్పిటాలిటీ, ఎంటర్​టైన్​మెంట్​ కోసం రూ.4 కోట్లు అలాట్ చేశారు.