ప్రభుత్వ కాలేజీ బిల్డింగ్ లకు  రూ. 11.90 కోట్లు...మంత్రి ఉత్తమ్ చొరవతో నిధులు మంజూరు

ప్రభుత్వ కాలేజీ బిల్డింగ్ లకు  రూ. 11.90 కోట్లు...మంత్రి ఉత్తమ్ చొరవతో నిధులు మంజూరు

హుజూర్ నగర్,వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాల ఆధునీకరణకు రూ. 11. 90 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీవో నంబర్ 234 కింద డిగ్రీ కాలేజీ బిల్డింగ్ కు రూ. 4.65 కోట్లు,  జీవో నంబర్  235 కింద రూ.7.25 కోట్లు జూనియర్ కాలేజీ బిల్డింగ్ కు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. టెండర్లను పిలిచి వెంటనే పనులు చేపట్టేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిధుల మంజూరులో మంత్రి ఉత్తమ్ చొరవ చూపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.