రూ. 12 కోట్ల ఎన్ఎస్పీ స్థలం కబ్జాకు యత్నం

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్,  డీఎస్పీ, మున్సిపల్ ఆఫీస్​ల కూతవేటు దూరంలో కడుతున్న  మినీ రవీంద్ర భారతి, ఇంటిగ్రేటెడ్​ వెజ్​నాన్​వెజ్​  మార్కెట్​కు  పక్కనే  సుమారు రూ.12 కోట్ల విలువైన 20 గుంటలకుపైగా ఉన్న ఎన్​ఎస్పీ స్థలాన్ని కొందరు కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్థలాన్ని చదును చేయటంతో ఎన్​ఎస్పీ ఆఫీసర్లు టూ టౌన్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. కొన్నేళ్ల కింద స్థ లం చుట్టూ కంపౌండ్ వాల్​ కట్టి గేటుకు తాళం వేశారు. కాగా కొందరు తాళం పగలగొట్టి జేసీబీ తో స్థలాన్ని చదును చేశారు.

దీంతో ఎన్​ఎస్పీ ఆఫీసర్లు ఈ నెల 21న టూటౌన్​ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఈ భూమి విలువ గజం రూ. 40 నుంచి 45 వేలకుపైగా ఉంది.  ఈ క్రమంలో అక్రమార్కుల కన్ను ఈ భూమిపై ప డింది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన స్థ లం కబ్జా కాకుండా రెవెన్యూ, ఎన్​ఎస్పీ ఆఫీసర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.