ఎములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు

ఎములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు
  • మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
  • రేపు వేములవాడకు సీఎం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం  అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు రూ.127.65 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకుగానూ రూ.76 కోట్లు,  మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్ల విస్తరణకు

రూ.47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌‌‌‌ లైన్‌‌‌‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు మంజూరయ్యాయి. రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి, ఇందుకు కృషిచేసిన మంత్రులు పొన్నం, శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబుకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ కృతజ్ఞతలు తెలిపారు. 

రేపు వేములవాడకు సీఎం

వేములవాడలో సీఎం రేవంత్‌‌‌‌ ఈ నెల 20న  పర్యటిం చనున్నారు. బుధవారం ఉదయం 9.15 గంటలకు రేవంత్​ వేములవాడకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.40 గంటల వరకు తన పర్యటన కొనసాగించనున్నారు. తొలుత వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు.

అనంతరం వేములవాడ ఆలయంతోపాటు పట్టణాభివృద్ధిపై రివ్యూ చేయనున్నారు. అక్కడి నుంచి వేములవాడ గుడిచెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.