చుండ్రుగొండ మండలంలో రూ13.40 లక్షలు స్వాధీనం

చండ్రుగొండ,వెలుగు : ఉమ్మడి  జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 17.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుండ్రుగొండ  మండలంలో ఎటువంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.13.40 లక్షలు నగదు ను స్వాధీన పర్చుకున్నట్లు ఎస్సై రవి తెలిపారు. చండ్రుగొండలో సోమవారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో పోలీసులు వెహికిల్ చెకింగ్ నిర్వహించారు.  ముగ్గురు వ్యక్తులు ఈ డబ్బును తీసుకెళుతుండగా పట్టుకున్నామన్నారు.   

రూ.2 లక్షల 80 వేలు సీజ్

అన్నపురెడ్డిపల్లి,వెలుగు : ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 2,80,000  పోలీసులు సీజ్​ చేశారు. మండలంలోని భూర్గూడెం చెక్​ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. తిరువూరు వైపు నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ​కారును చెక్​చేయగా అందులో ఆధారాలు లేకుండా ఉన్న  రూ. 2,80,000లు లభించాయి. క్యాష్​ను అన్నపురెడ్డిపల్లి ఎస్సై షాహినా సీజ్​ చేశారు. 

ALSO READ : అధికారంలోకి రాగానే జీవన్ రెడ్డితో అవినీతి సొమ్ము కక్కిస్తం : ఎంపీ ధర్మపురి అర్వింద్

లక్ష క్యాష్  సీజ్

అశ్వారావుపేట, వెలుగు : సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. లక్ష పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో అశ్వారావుపేట బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వెహికల్ చెకింగ్ చేపట్టారు. ఏపీలోని సీతానాగారం గ్రామానికి చెందిన పాలమూరు వెంకట్రావు అనే వ్యక్తి కారును తనిఖీ చేసినపుడు లక్ష రూపాయల క్యాష్  దొరికిందన్నారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో క్యాష్​ సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.