ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్

ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్

ఖమ్మం జిల్లాలో భారీగా డబ్బు పట్టుబడింది.  జిల్లాలోని కూసుమంచి మండలం దేవుని తండాలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది.  అయితే, కారులో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డిక్కీలో నగదు తీసుకుని వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. అందులో ఉన్న రెండు బ్యాగులు తీసి లెక్కించగా కోటీ ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నగదు కు ఎలాంటి రసీదులు లేకపోవడంతో డబ్బు ఎవరిది ఎక్కడికి వెళ్తుంది అనే కోణంలో కూసుమంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహన డ్రైవర్ కు గాయాలు కావడంతో ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ను విచారిస్తే.. మరింత సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

కారులో కోటి 50 లక్షల క్యాష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బుకు ఎలాంటి రసీదులు లేకపోవడంతో పోలీసులు క్యాష్ ని సీజ్ చేశారు. అయితే కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత డ్రైవర్ ను విచారించనున్నారు పోలీసులు