మేడారం జాతరకు 152 కోట్లు

మేడారం జాతరకు 152 కోట్లు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది జరగనున్న మేడారం జాతరకు రాష్ట్రప్రభుత్వం బడ్జెట్ లో రూ. 152.96 కోట్లు కేటాయించింది.ఎస్టీ బడ్జెట్ లో ఈ నిధులను చేర్చారు. గతేడాది రూ. 110 కోట్లు కేటాయించగా ఈ ఏడాది సుమారు రూ. 42 కోట్లు పెంచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 3 రోజుల పాటు జాతర ఘనంగా జరగనుంది. 

ఈ జాతరకు తెలంగాణ, ఏపీ నుంచేగాక దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి లక్షాలాది మంది భక్తులు రానున్నారు. 2023లో ఈ జాతరకు 15  లక్షల మంది భక్తులు హాజరుకాగా.. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఈనేపథ్యంలో వసతుల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. వచ్చే నెల నుంచి పనులు స్టార్ట్ కానున్నాయి.