ఆమనగల్లు, వెలుగు : నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ఆర్ఆర్ఎం గ్రాంట్ కింద రూ.15 కోట్ల 59 లక్షల 40 వేలు మంజూరు చేసిందనిఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఆమనగల్లులో మీడియాతో మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.3.10 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రూ. 500 కోట్లతో ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు.
పథకాలపై అసత్య ప్రచారం సరికాదు..
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ అసత్య ప్రచారం చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యాట నరసింహ, భాస్కర్ రెడ్డి, హనుమ నాయక్, జగన్, ప్రభాకర్ రెడ్డి, బిచ్చ నాయక్, మంగ్లీ రాములు, మానయ్య , పాల్గొన్నారు.