
స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ లక్ష పాయింట్లకు వెళుతుంది.. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమికీ రిచ్ అవుతున్నాం అన్న బలమైన సంకేతాల నుంచి.. ఇండియన్ స్టాక్ట్ మార్కెట్ కుప్పకూలిపోయే వరకు వచ్చింది. 2025లోనే దారుణంగా మట్టికొట్టుకుపోయారు చిన్న ఇన్వెస్టర్లు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే.. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు.. 59 రోజుల్లో.. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు చెందిన 83 శాతం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. దీని విలువ ఎంతో తెలుసా.. అక్షరాల 15 లక్షల 56 వేల 572 రూపాయలు. అంటే రోజుకు 50 వేల కోట్ల రూపాయలు నష్టం.. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ.. స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుబడిదారులు నష్టపోయిన మొత్తం ఇది..
బాంబే స్టాక్ ఎక్చేంజ్ లో నమోదైన 936 స్మాల్ క్యాప్ షేర్లలో 518 షేర్లు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే 30 శాతం వరకు పడిపోయాయి. కొన్ని షేర్లు అయితే ఏకంగా 50 శాతం నష్టపోయాయి. 2 వేల రూపాయల షేరు.. ఇప్పుడు వెయ్యి రూపాయలకు పడిపోయింది. 70 శాతం మార్కెట్ విలువను కోల్పోయిన కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ పేర్లను పరిశీలిస్తే.. jai Corp Ltd, Vakrangee Ltd, Zen Technologies Ltd, Quick Heal Technologies Ltd, Swelect Energy Systems Ltd, Precision Camshafts ఇలాంటి షేర్లు భారీగా నష్టపోయాయి. షేరు విలువ పెరుగుతుందని ఇందులో పెట్టుబడి పెట్టినోళ్లకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి.
Also Read:-EPFO వడ్డీరేటు 8.25శాతం..EPFO బోర్డు ఆమోదం..
భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 936 బీఎస్ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 55 శాతం షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడటం పెట్టుబడిదారులకు నిరాశను మిగిల్చింది. బేర్స్ పంజాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ కేటగిరీ షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి రోజురోజుకూ పెరగటంపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు కొన్ని నెలల కిందట అధికంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఈ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ కి కూడా భారీగా డబ్బులు వచ్చాయి. ప్రస్తుతం అవే స్టాక్ట్స్ ఇప్పుడు నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల డబ్బు కర్పూరంలా కరిగిపోతోంది. 2025 ప్రారంభం నుంచి అంటే.. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్మాల్ క్యాప్ కంపెనీలు పెట్టుబడిదారులు ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.
వీకెండ్ శుక్రవారం స్టాక్ మార్కెట్ అత్యంత దారుణంగా నష్టపోయింది. చిన్న ఇన్వెస్టర్లను నిలువునా ముంచింది. ఇదంతా ఎప్పటికి రికవరీ అవుతుంది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు.