చూసుకోవాలి కదమ్మా : బైక్ పై 17 లక్షలు తీసుకెళుతూ దొరికిపోయారు

చూసుకోవాలి కదమ్మా : బైక్ పై 17 లక్షలు తీసుకెళుతూ దొరికిపోయారు

హైదరాబాద్ సిటీలో మరోసారి భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సరిగ్గా గండి మైసమ్మ చౌరస్తా దగ్గర వాహనాలు చెక్ చేస్తుండగా.. ఓ బైక్ పై బ్యాగ్ తో వెళుతున్న వ్యక్తిని తనిఖీ చేశారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అధికారులు.

Also Read :- 60 ఏళ్ల చరిత్రకు ముగింపు

ఆ బ్యాగ్ లో 17 లక్షల 40 వేల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. డబ్బుకు సరైన పత్రాలు చూపించకపోవటంతో.. ఆ డబ్బు మొత్తాన్ని ఎన్నికల అధికారులకు అప్పగించారు పోలీసులు. పట్టుబడిన డబ్బు అంతా.. వంద, 200 వందలు.. 500 రూపాయల నోట్లుగా ఉంది. ఈ డబ్బు వ్యక్తిగత అవసరాలు, వ్యాపారం కోసం తీసుకెళుతున్నట్లు బైక్ పై వ్యక్తి చెబుతుండగా.. సరైన కాగితాలు చూపించకపోవటంతో సీజ్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు. ఎన్నికల అధికారుల దగ్గర డబ్బుకు సంబంధించిన ఫ్రూప్స్ చూపించి.. తీసుకోవాలంటున్నారు పోలీసులు.