పిట్లం, వెలుగు : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారు జాము చోరీ జరిగింది. రూ. 17.79 లక్షలు ఎత్తుకెళ్లినట్టు ఎస్సై రాజు తెలిపారు. కేవలం పది నిమిషాల్లోనే గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచుకున్నారు. ఏటీఎం బయట సీసీ కెమెరాపై కలర్ స్ర్పే చేసి ఏటీఎంలోకి వెళ్లారు.
గతంలో ఇదే ఏటీఎంలో మూడు సార్లు చోరి జరిగింది. అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి, బాన్సువాడ సీఐ రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం సూపర్ వైజర్ రాచార్ల ప్రవీణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.