నిర్వాసితుల అకౌంట్లలో డబ్బులు జమ

రేవల్లి, వెలుగు: పీఆర్ఎల్ఐ, ఏదుల ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోయిన కొంకలపల్లి, బండరాయిపాకుల ముంపు గ్రామస్తుల అకౌంట్లలో రూ.1.88 కోట్లు జమ అయ్యాయి. గత ప్రభుత్వంలో ఏదుల రిజర్వాయర్ లో 2014లో ఇండ్లు, ఆస్తులు కోల్పోగా, కొందరికి పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించకుండా గ్రామం నుంచి ఖాళీ చేయించారు. దీంతో వారు ఆర్అండ్ఆర్  సెంటర్​లో గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు.

 ఇదిలాఉంటే గురువారం తల్పునూర్  సబ్​ స్టేషన్​ ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితుల అకౌంట్లో డబ్బులు జమ చేయిస్తానని హామీ ఇచ్చారు. మరునాడే ముంపు గ్రామస్తుల అకౌంట్లో డబ్బులు జమ కావడంతో ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.