మేడారంలో లైట్లు మాయం.. రోడ్లన్నీ చీకటిమయం

  • రూ.2.15 కోట్ల విలువైన సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్లు మాయం
  • మేడారం భక్తుల కోసం రెండేండ్ల క్రితం ఏర్పాటు
  • చోరీచేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • పట్టించుకోని పంచాయతీలు
  • సమ్మక్క వెళ్లే రూట్లలో ప్రధాన సెంటర్లన్నీ చీకటిమయం

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: మేడారం వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్లు మాయమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరికరాలను దొంగిలిస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో ప్రధాన సెంటర్లన్నీ చీకటితో నిండిపోతున్నాయి. రెండేళ్ల క్రితం సోలార్​లైట్లపై ఖర్చు చేసిన  రూ.2.15 కోట్ల నిధులు ఆఫీసర్లు, పంచాయతీల నిర్లక్ష్యంతో వృథా అయ్యాయి. గిరిజన గ్రామాల్లో కారు చీకట్లను పారదోలేందుకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మేడారం పరిసరాలలోని 13 గ్రామాల్లో 200 సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బయ్యక్కపేట, వెంగళాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పడిగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొత్తూరు, కన్నెపల్లి, ఊరట్టం, మేడారం, రెడ్డిగూడెం, ఎలుబాక, కాల్వపల్లి తదితర గ్రామాల్లో లైట్ల ఏర్పాటుకు రూ.2.15 కోట్లు ఖర్చు చేశారు. 2019  డిసెంబర్ నెలలో  పనులు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు వీటి పర్యవేక్షణ కరవైంది. దీంతో సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్ల ప్యానెళ్లు, బ్యాటరీలను  గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. పస్రా‒తాడ్వాయి, కాటారం‒భూపాలపల్లి నుంచి మేడారం వెళ్లే దారిలో ప్రధాన సెంటర్ల దగ్గర ఏర్పాటు చేసిన సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్లు వెలగట్లేదు. అంతేకాకుండా గ్రామాల్లో స్కూళ్లు, ప్రభుత్వ భవనాలు,  ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సగానికి పైగా సోలార్ లైట్లు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో చోరీకి గురయ్యాయి. దీంతో మేడారం వెళ్లే ప్రధాన రోడ్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో మళ్లీ చీకట్లు కమ్ముకున్నాయి. 

బాధ్యత పంచాయతీలదే 
కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నిధులతో 13 గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేశాం. వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదే. రెండేళ్లకే సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్లు వెలగకుండా పోవడం బాధాకరం. సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్ల సామగ్రిని కొందరు దొంగిలించుకుపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 
‒ అబీబ్ ఖాన్, గిరిజన సంక్షేమ శాఖ ఏఈ, తాడ్వాయి


సోలార్ లైట్లు పునరుద్ధరించాలె
గతంలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు ఇప్పుడు పని చేయడం లేదు. వాటిని దొంగలు ఎత్తుకెళ్లినా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇవి పునరుద్ధరించాలని పలుసార్లు చెప్పినప్పటికీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.  గ్రామాల్లో వీధులు చీకటిమయంగా మారిపోయాయి. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి సోలార్ లైట్లు పునరుద్ధరించాలి.
‒ ఎనగంటి సాయికృష్ణ, నార్లాపూర్, తాడ్వాయి మండలం