గ్లోబల్ రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా
కరోనాతో దెబ్బతిన్న అసెట్ క్వాలిటీ
పెరిగిన క్రెడిట్ ఖర్చులు
కోల్‌కతా : ఇండియాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే రెండేళ్లలో రూ.2.1 లక్షల కోట్ల క్యాపిటల్ కావాలని గ్లోబల్ రేటింగ్ సంస్థమూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ లెక్కగట్టింది. కరోనా సంక్షోభంతో డిఫాల్ట్స్ పెరుగుతున్నందున బ్యాంకులకు మరింత ఎక్కువ డబ్బు అవసరం అవుతుందని పేర్కొంది. లోన్లు కూడా యాన్యువల్‌గా 8 శాతం నుంచి 10 శాతం పెరుగుతాయని తెలిపింది. పీఎస్‌బీలకు అవసరమయ్యే నిధుల్లో సగానికి పైగా క్యాపిటల్, లోన్ లాస్ ప్రొవిజన్ల కేకేటాయించాల్సి ఉంటుందని మూడీస్ తెలిపింది. బ్యాంకులు పెద్దమొత్తంలో క్యాపిటల్ కొరతను ఎదుర్కొంటున్నాయని, క్రెడిట్ ఖర్చులు కూడా పెరుగుతు
న్నాయని వివరించింది.
కరోనాతో కష్టాలు..
కరోనా వైరస్ ఔట్ బ్రేక్‌తో ఇండియా ఎకనమిక్ గ్రోత్ బాగా పడిపోయింది. పీఎస్‌బీల అసెట్ క్వాలిటీ దెబ్బతింది. క్రెడిట్ ఖర్చులు కూడా బాగా పెరిగాయి. దీంతో లాభాలకు గండి పడిందని ఈ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ నష్టాల నుంచి బ్యాంక్‌లను కా
పాడేందుకు ఇండియన్ గవర్న్‌మెంట్ పీఎస్‌బీలకు మరింత క్యాపిటల్ ఇవ్వాల్సి ఉంటుందని మూడీస్ తెలిపింది. గతేడాది ప్రభుత్వం పెద్ద మొత్తంలో రీ క్యాపిటలైజేషన్ చేపట్టినప్పటికీ, క్యాపిటల్ ఇంకా కావాల్సి ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. బ్యాంక్‌లకు ఆర్‌బీఐ అనుమతించిన వన్ టైమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ అసెట్ క్వాలిటీ పడిపోవడాన్ని తగ్గిస్తున్నది. అయితే దీనివల్ల ఎన్‌పీఏలు పెరుగుతాయేమోనని మూడీస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వచ్చే రెండేళ్లలో క్రెడిట్ ఖర్చులు పెరుగుతాయని తెలిపింది. ఇది ఇప్పటికే తక్కువగా ఉన్న పీఎస్‌బీల లాభాలను బలహీనపరుస్తుందని మూడీస్ పేర్కొంది. అయితే మోడీ ప్రభుత్వం ఇది వరకే ప్రభుత్వ బ్యాంకులకు క్యాపిటల్ అవసరాల కోసం నిధులు కేటాయించింది.